Teenmar mallanna released from jail | తీన్మార్ మల్లన్న రిలీజ్ అయ్యారు...
తీన్మార్ మల్లన్న కోర్టు అన్ని కేసులలో మల్లన్నకు బెయిలును మంజూరు చేసిన విషయం మనకు తెలిసిందే,
దాదాపు 73 రోజుల సుధీర్ఘ జైలు జీవితం గడిపిన తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు ఈ సోమవారం రిలీజ్ అయ్యాడు. తదనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ పోషెట్టి, ఇక ఆట షురుపో అంటూ గళమెత్తారు జైలు జీవితం గడిపిన తరువాత కూడా ఇలాంటి భాష వాడుతున్నారు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. భాష ఎందుకు మారుతది, ఇది మన తెలంగాణ భాష ఇట్లనే ఉంటది అని జవాబిచ్చారు,తరువాత మాట్లాడుతూ నాకోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెపుతూ... ప్రత్యేకించి తమ న్యాయవాద బృందానికి తమ ధన్యవాదాలు తెలియ చేసారు తీన్మార్ మల్లన్న, ఇలా మాట్లాడుతూ... మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం నన్ను జైల్లో చంపాలని చూసింది అని ఒక సంచలన వాక్య చేశారు.
ప్రభుత్వం మల్లన్నను చంపటానికి తలచిన కుట్ర ను అతి త్వరలోనే QNEWS వేదికపై వివరిస్తాను అని తోలివెలుగు రిపోర్టర్ గంజి రఘు గారికి ఈ విషయాన్ని వివరించారు.
ఇది ఇలా ఉండగా... తీన్మార్ మల్లన్న కోసం వందలాదిగా ప్రజలు చంచల్ గూడా జైల్ కు తరలి వచ్చారు. ఈ జనాన్ని చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంది అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తు... KCR సభకు జనం రావాలి అంటే డబ్బులు ఇయ్యాలి, అలా ఇస్తే కూడా వస్తర లేదా అనే డౌట్ ఉంటది, కానీ మల్లన్న రిలీజ్ అయితుండు అని తెలిసి, రోడ్డు మీద పోయె జనం వల్ల బండ్లను పక్కకు పెట్టి మల్లన్న కోసం వచ్చిన పరిస్థితిను మనం గమనించొచ్చు , ప్రజలకోసం పోరాటం చేస్తే ప్రజలు ఎప్పటికీ మనల్ని మరవరు అని తెలియచేశారు.
తరువాత...
రిలీజ్ తర్వాత మల్లన్న కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఒక యాత్రగా బయలుదేరి, ఆఫీస్ కు చేరుకున్నారు. ఆఫీస్ ను చూసి , ఒక ఆసక్తకరమైన వాఖ్య చేసారు " ఉడిచే చీపురు కట్ట తప్ప ఎం లేవు, మల్లన్న జైలుకు పోతే QNEWS నడవదు అనుకున్నారు, కానీ మల్లన్న ఎక్కడున్నా ఈ ఆఫీస్ ఎప్పటిలానే నడుస్తుంది" ఈ ఆఫీస్ ను ముసేయడం ఎవరివల్ల కాదు మనకు న్యాయస్థానం ఉంది అన్నారు.
తరువాత ఇంటికి వెళ్ళిన తీన్మార్ మల్లన్న కుటుంబ సభ్యులను కలిసి ఆలింగనం చేసుకున్నారు. తన ఇద్దరు కుతురులను చూసి మురిసిపోయారు మల్లన్న.
ఆ మరుసటి రోజు తీన్మార్ మల్లన్న QNEWS ఆఫీస్ కి వచ్చారు.. అయితే ఒక మూడు రోజుల వరకు కండిషన్ బైల్ ఉండటం వలన మల్లన్న ఎక్కువగా మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే morning news with mallanna అనే ప్రోగ్రాంలో వార్తలు చదవటం మాత్రం ఆ కండిషన్ బెయిల్ అయిపోయాక చదవటం మొదలు పెడతాను అని చెప్పారు.
ఇదే రోజు మల్లన్న ఒక ఆసక్తకరమైన ప్రకటన చేశారు, మరికొన్ని రోజుల్లో నేను మా టీం ఒక నిర్ణయం తీసుకో బోతున్నం అని చెప్పారు. అయితే ఇప్పటివరకు నన్ను ఎలా ఆయితే ఆదరించారో ఆ నిర్ణయం తరువాత కూడా అలానే ఆదరిస్తారు అని ఆశిస్తున్నారు అని చెప్పారు.
అయితే ఆ ప్రకటన QNEWS లో ఒక స్పెషల్ షో ద్వారా మరో రెండు రోజుల్లో వెల్లడిస్తను అని తెలియచేశారు.
అయితే మల్లన్న ఎపుడు ఒంటరి నిర్ణయాలు తీసుకోవడం జరగదు కేవలం టీంతో చర్చించిన తరువాతనే ఎలాంటి నిరణయమైనా తీసుకుంటాం అని తెలియచేశారు.
అయితే మల్లన్న తీసుకోబోయే ఆ నిర్ణయం ఏమిటి?
ఇప్పుడు ఈ చర్చ రాజకీయ రంగంలో చర్చనీయాంశం గా మారింది, ఈ ప్రకటన ఏమిటి అని చాలా మంది వేచిచూస్తున్నారు.
అయితే కొందరు BJP lo జాయిన్ అవ్వటం అని మరికొందరు పాద యాత్ర అని ఇంకొందరు కొత్త పార్టీ అని ఇలా చాలా రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆ విషయం ఏమిటి అనేది మాత్రం తెలుసుకోవాలి అంటే ఇంకొక రెండు రోజులు ఆగాల్సిందే...
1 Comments
Jai mallanna
ReplyDelete